తగ్గేదేలె.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ ‘‘పుష్ప’’ దూకుడు, రూ.250 కోట్ల పైమాటే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి భాగం `పుష్పః ది రైజ్` పేరిట డిసెంబర్ 17న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఇదిలా వుండగా విడుదలకు ముందే పుష్పకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్టు తెలుస్తుంది. ఏకంగా రూ. 250 కోట్ల బిజినెస్ జరిగిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన లాస్ట్ హిట్ `అల వైకుంఠపురములో` చిత్రంతో ద్వారా భారీ మార్కెట్‌ను సొంతం చేసుకున్నారు బన్నీ. అలాగే రంగస్థలం హిట్‌తో సుకుమార్ సైతం మంచి జోరు మీదున్నారు. దీనికి తోడు `ఆర్య`, `ఆర్య2` వంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ కావడంతో పుష్పపై మొదటి నుంచే మంచి హైప్ వుంది. ఈ నేపథ్యంలోనే పలు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ‘‘పుష్ప’’ రైట్స్ కోసం ఎగబడినట్లుగా ఫిలింనగర్ సమాచారం. అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేటుకి పుష్ప అమ్ముడు పోయిందని టాక్. తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్, అలానే నాన్ థియేట్రికల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్) కలుపుకొని 250 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
పుష్పలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పాటలు, పోస్టర్ల ద్వారా సినిమాపై హైప్ పెంచారు. గత సోమవారం విడుదలైన ట్రైలర్, నిన్న బయటకొచ్చిన సమంత ఐటెం సాంగ్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments