శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ 25వ చిత్రంగా 'డీజే దువ్వాడ జగన్నాథమ్ ' చేయడం గౌరవంగా భావిస్తున్నా - అల్లుఅర్జున్
Send us your feedback to audioarticles@vaarta.com
`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ఈ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగింది. బిగ్ సీడీని అల్లు అరవింద్ మనవడు అల్లు అయాన్, దిల్‌రాజు మనవడు అరాంచ్ విడుదల చేశారు. ఆడియో సీడీలను అల్లు అరవింద్ విడుదల చేసి తొలి సీడీని దర్శకుడు హరీష్ శంకర్‌కు అందించారు.
మా కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ కావాలి
స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - 'పబ్బులో వాయించే డీజే కాదు, పగిలిపోయేలా వాయించే డీజే అనే డైలాగ్‌తోనే ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఈ ఏంటో చెప్పవచ్చు. అలాగే పగిలిపోయేలా మ్యూజిక్ కావాలని దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకున్నాం. తను ప్రతి పాటతో ఆడియెన్స్‌కు మరింత దగ్గరగా తీసుకెళుతున్నాడు. తనకు థాంక్స్. నాకు సాధారణంగా అమ్మాయిల నవ్వు, డిగ్నిటీ అంటే ఎంతో ఇష్టం. ఆ రెండు ఉన్న అమ్మాయి పూజా హెగ్డే. మంచి హార్డ్ వర్కర్,డేడికేషన్ ఉన్న హీరోయిన్, మంచి హైట్స్ చేరుకుంటుంది. ఈ సినిమాలో పూజను చూసిన తర్వాత కుర్రాళ్ళు లవః, లవస్త్య, లవభ్యోః అంటూ ఆమెతో ప్రేమలో పడతారు. డైరెక్టర్స్ గురించి చెప్పాలంటే ముందుగా దాసరి నారాయణరావుగారి గురించి చెప్పాలి. దాసరి నారాయణరావుగారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ గుర్తుంటారు. ఆయన్ను ఇండస్ట్రీ ఎంతో మిస్ అవుతుంది. ఇక ఈ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ విషయానికి వస్తే, తన సినిమాలన్నీ చూశాను. ఆయన సినిమాలన్నింటిలో పంచ్ డైలాగ్స్ బావుంటాయి. ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత రాయగలరో, అంత ఎమోషన్ కూడా రాయగలరు. అలాంటి సినిమా నేను చేయాలనుకున్నాను. అలాంటి సినిమాయే ఇది. దువ్వాడ జగన్నాథమ్‌గా ఎంటర్టైన్మెంట్ ఉంటే డీజేగా ఎమోషన్స్ ఉంటాయి.
మంచి కథ కుదిరింది.చాలా మంచి డెప్త్ ఉన్న దర్శకుడైనా చాలా సరదాగా కనపడతారు. తనలోని రెండు సైడ్స్‌ను ఈ సినిమాలో కనపడతాయి. నన్ను పువ్వులా చూసుకున్నారు. సుబ్బరాజు,రావు రమేష్, మురళీశర్మ, సినిమాటోగ్రాఫర్, రవీందర్‌రెడ్డి, రామ్‌లక్ష్మణ్ మాస్టర్స్, ఎడిటర్‌గారు, సాహిత్య రచయితలకు సహా అందరికీ థాంక్స్. మెగాభిమానులు అంటే కేవలం మెగాస్టార్ అభిమానులే కాదు, చిరంజీవిగారు, పవన్‌కళ్యాణ్‌గారు, రామ్‌చరణ్, తేజు, వరుణ్, నిహ ఇలా అందరి అభిమానులు సహా ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దిల్‌రాజుగారు, నేను ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు ఆయన బ్యానర్లో మూడోసారి, 25వ సినిమా చేస్తున్నాం. మా బ్యానర్ తర్వాత హోం బ్యానర్‌లా ఫీలయ్యే బ్యానర్ ఇది. ఎంతో మంది కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన బ్యానర్. అటువంటి బ్యానర్లో 25వ సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను. నా రెండో సినిమా ఆర్య, దిల్‌రాజుగారి రెండో సినిమా ఆర్య, నా ఆరో సినిమా పరుగు, దిల్‌రాజుగారి ఆరో సినిమా పరుగు. ఇప్పుడు మా కాంబినేషన్లో వస్తున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ హ్యాట్రిక్ హిట్ మూవీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కేవలం దిల్‌రాజుగారి కోసమే ఆడాలి. ఎందుకంటే దిల్‌రాజుగారి సతీమణి, అనిత అంటీ..అందర్ని వదలిపెట్టి వెళ్ళిపోయారు. సినిమా షూటింగ్ కంటిన్యూగా జరుగుతుందో లేదోనని అనుకున్నాం. కానీ దిల్‌రాజుగారు ఐదోరోజు లేదా ఆరో రోజు సెట్‌కు వచ్చి లోపల బాధపడుతున్నా, బాధను చూపెట్టక సరదాగా ఉండి సినిమాను పూర్తి చేయించారు. అందుకనే ఆయన కోసమే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి'' అన్నారు.
అభిమానులు గర్వంగా చెప్పుకునేలా సినిమా ఉంటుంది
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేసి 14 సంవత్సరాలైంది. మా బ్యానర్లో దిల్ తొలి సినిమా అయితే సెకండ్ మూవీ నేను, బన్ని కలిసి ఆర్య చేశాం. సినిమా ప్రారంభంలో బన్ని ఒక హీరోగా, నేను నిర్మాతగా వ్యవహరిస్తే సినిమా ట్రావెల్లో ఓ కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయాం. అరవింద్‌గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసిపోయాయి. ఆర్య బన్నికి ఓ స్టార్ ఇమేజ్ను, సుకుమార్‌ను ఓ స్టార్ డైరెక్టర్‌ను చేయడమే గాక మా సంస్థకు స్టార్ ఇమేజ్ను తీసుకొచ్చిన మూవీ. తర్వాత మా బ్యానర్లో పరుగు సినిమా చేశాం. పరుగులో బన్ని పెర్పామెన్స్ ఏంటో చూపించాడు. పరుగు బన్నికి ఆరో సినిమా. అలాగే మా బ్యానర్‌కు పరుగు ఆరో సినిమా. బన్నితో మళ్ళీ సినిమా తీయడానికి 9ఏళ్ళు పట్టింది. అందుకు కారణం. మంచి కథ. మళ్ళీ మన కాంబినేషన్లో సినిమా అంటే మంచి కథ ఉండాలని బన్ని చెప్పేవాడు. అది వచ్చిన రోజే సినిమా చేద్దామని బన్ని అనేవాడు.
నాలుగేళ్ళుగా ఏన్నో కథలను అనుకున్నా ఏవీ వర్కవుట్ కాలేదు. ఇక హరీష్ గబ్బర్‌సింగ్‌తో, నాకు మంచి రిలేషన్ ఏర్పడింది. నేను, హరీష్ రెండు సినిమాలు చేశాం. నేను, హరీష్‌తో చేస్తున్న మూడో సినిమా ఇది. మా బ్యానర్‌కు 25వ సినిమా. ఇది మా బ్యానర్‌కు స్పెషల్ . నా కూతురు ఓసారి 'నాన్న మన బ్యానర్లో 25వ సినిమా చాలా స్పెషల్‌గా ఉండాలి..అది బన్ని అన్నయ్యతో బావుంటుంది' తను అలా ఎందుందో తెలియదు కానీ బన్ని, హరీష్ కాంబినేషన్లో 25వ సినిమా చేయడం ఆనందంగా ఉంది. జూన్ 23న సినిమానే మాట్లాడుతుంది. దేవిశ్రీప్రసాద్ మా బ్యానర్లో చేస్తున్న ఏడో సినిమా. పూజా బన్ని పక్కన తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా పెర్ఫార్మెన్స్ చేసిందని అరవింద్‌గారు కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా పూజాకు కూడా థాంక్స్. 23న సినిమా చూసి బయటకు వచ్చి గర్వంగా చెప్పుకునేలా సినిమా ఉంటుంది'' అన్నారు.
అభిమానులు కాలర్ ఎగరేస్తారు
చిత్ర దర్శకుడు ఎస్.హరీష్ శంకర్ మాట్లాడుతూ - ''డీజే ఆడియో జ్యూక్ బాక్స్‌ను విడుదల చేశాం. పాటలు బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయని చాలా మంచి ఫోన్స్ చేసి అభినందించారు. స్క్రీన్ మీద హీరో బన్ని అయితే, స్క్రీన్ వెనుక దేవిశ్రీ హీరో. ఒక సన్నివేశాన్ని డైరెక్టర్ కంటే ఎక్కువగా అర్థం చేసుకుని సంగీతం అందించే దేవిశ్రీ ప్రసాద్ రికార్డింగ్ చివరి నిమిషం వరకు పాటలోని సాహిత్యం గురించి ఎక్కువగా తపన పడుతుంటాడు. ఈరోజు ఉదయం కూడా డీజే సినిమాను పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కలిపి చూశాను. పాటలెంత బావున్నాయో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతకంటే గొప్పగా ఉంది. దేవిశ్రీకి పెద్ద థాంక్స్. నాకు గబ్బర్‌సింగ్ సక్సెస్ అయిపోయాక, గబ్బర్‌సింగ్ గురించి పవన్‌కళ్యాణ్‌గారు ఎప్పుడూ, ఎక్కడా మాట్లాడలేదు. సినిమా విడుదలైన తర్వాత ఓసారి పవన్‌కళ్యాణ్‌గారిని వెళ్ళి కలిసి, ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. మీరు కూడా ఒక ఇంటర్వ్యూ ఇస్తే బావుంటుందని అన్నాను. కానీ ఆయన మాత్రం 'హరీష్ జాగ్రత్తగ ఉండు..ఎందుకంటే మంచి సక్సెస్ వచ్చింది. సక్సెస్ మనిషిని కుదురుగా ఒకచోట ఉండనీయదు.
సక్సెస్ ఓ మనిషికి ఎంత చెడ్డ చేయాలో అంత చెడు చేస్తుంది కాబట్టి జాగ్రత్త. సక్సెస్ తర్వాత మన మాటల్లో ఒక తప్పునైనా వెదుకుతారు. అందుకే సక్సెస్ కోసం నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడి, తర్వాత దానికి దూరంగా వెళ్ళిపోతాను. సక్సెస్ కనపడుతున్నప్పుడు మనం ఎందుకు కనపడాలి' అన్నారు. అలా ఆయన అన్న మాటే డీజేలో మనం చేసే మంచి కనపడితే చాలు..మనిషి కనపడక్కర్లేదు' అనే డైలాగ్‌కు ఇన్స్పిరేషన్. పవర్‌స్టార్‌తో సినిమా ఎప్పుడు అని చాలా మంది అడుగుతుంటారు. గబ్బర్‌సింగ్ సినిమా చేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకు ప్రకృతి సహకరించింది. ఇప్పుడు కూడా ఆయన నుండే ఆదేశం రావాలి. నేను ముందు పవన్‌కళ్యాణ్‌గారి అభిమానిని. తర్వాతే గబ్బర్‌సింగ్ డైరెక్టర్ని. ఒక్కసారి పవన్ఫ్యాన్ అంటే కట్టె కాలే వరకు పవన్ ఫ్యాన్నే. దర్శకుడిగా నా స్థాయిని పెంచింది పవన్కళ్యాణ్గారైతే, దర్శకుడిగా నాకు జన్మనిచ్చింది మాత్రం నా అన్నయ్య రవితేజగారి నా ఆటోగ్రాఫ్ సినిమా కోసం వర్క్ చేస్తున్నప్పుడు మే 7 2004లో విడుదలైన ఆర్య రాజమండ్రిలో దుమ్ము రేపుతుంది. ఆ సినిమా షూటింగ్లో ఉండగా, అందరూ ఆర్య సినిమా చూడమని ఫోన్స్ చేస్తున్నారు.
సాయంత్రం సినిమా షూటింగ్ పూర్తి కాగానే, అందరూ కలిసి రాజమండ్రిలో ఆర్య సినిమా చూశాం. కో డైరెక్టర్ అయిన నాకు ఆరోజు రాత్రి నిద్ర పట్టలేదు. ఆర్య సినిమాలో బన్ని మూన్ వాక్ చూసి ఎప్పుడైనా ఈ హీరోతో పనిచేస్తానా, చేస్తే ఈ మ్యూజిక్ డైరెక్టర్‌తో పనిచేస్తానా, ఓ కొత్త దర్శకుడికి అన్ని సమకూర్చిన రాజుగారితో పనిచేస్తానా అని రాత్రంతా ఆలోచిస్తూ ఎగ్జయిట్‌మెంట్‌తో నిద్ర పట్టలేదు. కానీ ఈరోజు అదే హీరో, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్‌తో పనిచేస్తున్నాను. మన సంకల్పం గట్టిగా, స్వచ్చంగా ఉంటే అది జరిగి తీరుతుంది. అల్లుఅర్జున్గారికి నేను ఆర్య నుండి పెద్ద ఫ్యాన్‌ని. నాది ఆరు సినిమాల అనుభవమైతే, అల్లుఅర్జున్గారిది 17 సినిమాల అనుభవం. ఏకాగ్రతకు మహాభారతంలో నిదర్శనం అర్జునుడు. బన్నికి అర్జున్ అని పేరు అరవింద్‌గారు ఏ ముహుర్తాన పెట్టారో తెలియదు కానీ, బన్నికి 24గంటలు తప్ప వేరే ధ్యాస ఉండదు. తొలిసారి బన్ని ఇందులో బ్రహ్మణ అబ్బాయి పాత్ర చేశాడు. క్యారెక్టర్ కోసం బన్ని పడ్డ కష్టం చూసి, బ్రహ్మణులందరూ తనను అక్కున చేర్చుకుంటారు. క్యారెక్టర్ చేస్తున్నంత సేపు నాన్‌వెజ్ కూడా మానేసారు. ఓ డైరెక్టర్‌ను మాగ్జిమమ్ పుష్ చేసి నా నుండే అన్ని రాబట్టుకున్నారు. అన్ని క్యారెక్టర్స్ సినిమాలో బావున్నాయి. సినిమాకు పూజా పెద్ద ప్లస్. క్లైమాక్స్‌లో ఫైట్ లేకుండా ఎంటర్టైనింగ్గా పూర్తి చేయడానికి బన్నిగారెంతో పుష్ ఇచ్చారు. సినిమా చూసిన ప్రతి అభిమాని కాలర్ ఎగరేస్తాడు. అందుకు నాది పూచీ'' అన్నారు.
దిల్‌రాజు కోసం సినిమా సూపర్‌హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ''బన్ని కోసం ఈ సినిమా హిట్ కావాలనుకోవడం సహజమే. ఓరోజు నేను ఇంట్లో వెళుతుంటే, మా ఇంట్లో బ్రహ్మణులను చూసి ఇంట్లో ఏదో పూజ ఏమోనని అనుకున్నాను. అయితే బన్ని ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం వేదాలు ఎలా చదవాలని, ఎలా మాట్లాడాలని నేర్చుకుంటున్నాడని తెలిసి, ఇన్ని సినిమాలు తర్వాత కూడా తను క్యారెక్టర్ కోసం పడుతున్న కష్టం చూసి సినిమా హిట్ కావాలనుకున్నాను. అది కాకుండా దిల్‌రాజు నాకు ఇండస్ట్రీలో మంచి స్నేహితుడు. తనకు పూర్తి చేయలేని నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని నేను పూరించలేను కానీ, బన్ని సినిమాతో రాజుకు ఓ హిట్ వస్తే బావుండనని మనస్ఫూర్తిగా అనుకున్నాను. హరీష్‌తో ఎప్పుడూ మాట్లాడినా నాకు సూపర్‌హిట్ కావాలని అనేవాడు కాబట్టి తన కోసం. అలాగే దేవిశ్రీకి బన్ని అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంది బన్ని సినిమాలకు దేవి ఎప్పుడూ మంచి మ్యూజిక్‌నే ఇస్తాడు. అందరికీ థాంక్స్'' అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే, చిన్నికృష్ణ, రావు రమేష్, మురళీశర్మ, సుబ్బరాజు, జొన్నవిత్తుల, శ్రీమణి, బాలాజీ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com