బారీ ప్లానింగ్ లో బన్ని..

  • IndiaGlitz, [Tuesday,June 20 2017]

డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ జూన్ 23న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నాడు. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రంలో స్ట‌యిలిష్ లుక్‌తో పాటు బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా న‌టించాడు. బ్రాహ్మ‌ణ యువ‌కుడి ఎలా మాట్లాడుతారు. వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంద‌నే విష‌యాలను బ్రాహ్మ‌ణుల నుండే నేర్చుకున్నాడ‌ట‌. అలాగే హ‌రీష్‌కు కూడా క‌థ‌పై మంచి ప‌ట్టు ఉండ‌టంతో బ‌న్నికి సినిమా చేయ‌డం సుల‌భ‌మైపోయింద‌ట‌.

తెలుగులో డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ విడుద‌లైన వారం త‌ర్వాత మ‌ల‌యాళంలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని బ‌న్ని తెలిపాడు. హిందీలో చేయాల‌నే కోరికైతే ఉంది కానీ, ఇప్ప‌ట్లో హిందీలో ఎంట్రీ ఇచ్చే ఆలోచ‌న లేద‌ట‌. అయితే బాహుబ‌లి త‌ర‌హా మూవీని రెండు, మూడేళ్ళ‌లో చేయ‌డానికి ప్లాన్స్ చేసుకుంటున్నాడ‌ట‌. అలాగే వ‌చ్చే ఏడాది త‌మిళంలో స్ట్ర‌యిట్ సినిమా చేస్తాడ‌ట‌.

More News

దుబాయ్ లో ప్లాన్ చేస్తున్న శంకర్..

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావాలంటే అవి తప్పనిసరిగా ఉండాల్సిందే - రాజమౌళి

1986లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన రెండు రెళ్ళ ఆరు సినిమా పెద్ద థియేటర్స్లో నవ్వులు పువ్వులు పూయించింది. ఇప్పుడు అదే పేరుతో సినిమా రూపొందింది.

ఈసారి కూడా రీమేక్ సినిమాయేనా..

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ కానుండటంతో చేతిలోని సినిమాలను త్వర త్వరగా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

'నిన్ను కోరి' థియేట్రికల్ ట్రైలర్ కు 8 మిలియన్ వ్యూస్

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్నుకోరి'.

'రంగుల కల' ప్రారంభం

ఎల్.వి.మూవీ మేకర్స్ బ్యానర్పై కొత్త చిత్రం `రంగుల కల` సోమవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. వి.క్రాంతి కుమార్ దర్శక నిర్మాత. తొలి సన్నివేశానికి రాజ్కుమార్.ఎం. క్లాప్ కొట్టగా సిద్ధేశ్వర పీఠం స్వామి విశ్వదానంద కెమెరా స్విచ్ఛాన్ చేశారు.