బారీ ప్లానింగ్ లో బన్ని..
Send us your feedback to audioarticles@vaarta.com
డీజే దువ్వాడ జగన్నాథమ్‌గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో స్టయిలిష్ లుక్‌తో పాటు బ్రాహ్మణ యువకుడిగా నటించాడు. బ్రాహ్మణ యువకుడి ఎలా మాట్లాడుతారు. వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందనే విషయాలను బ్రాహ్మణుల నుండే నేర్చుకున్నాడట. అలాగే హరీష్‌కు కూడా కథపై మంచి పట్టు ఉండటంతో బన్నికి సినిమా చేయడం సులభమైపోయిందట.
తెలుగులో డీజే దువ్వాడ జగన్నాథమ్ విడుదలైన వారం తర్వాత మలయాళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని బన్ని తెలిపాడు. హిందీలో చేయాలనే కోరికైతే ఉంది కానీ, ఇప్పట్లో హిందీలో ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదట. అయితే బాహుబలి తరహా మూవీని రెండు, మూడేళ్ళలో చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాడట. అలాగే వచ్చే ఏడాది తమిళంలో స్ట్రయిట్ సినిమా చేస్తాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com