భారీ సినిమా ప్లాన్ లో బన్ని..
- IndiaGlitz, [Saturday,May 06 2017]
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తన మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం డిజె దువ్వాడ జగన్నాథమ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న బన్ని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు శివ నా ఇల్లు ఇండియా' సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు తన సినిమా మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడట బన్ని. లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే అందుకు సమయం పట్టేలాఉంది. అలాగే ఈలోపు అల్లుఅర్జున్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట.
13బి, ఇష్క్, మనం, 24 సినిమాలతో దర్శకుడిగా తనెంటో ప్రూవ్ చేసుకున్న విక్రమ్ కుమార్ ఇప్పుడు అఖిల్ హీరోగా జున్ను అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. విక్రమ్ కుమార్ వంటి డైరెక్టర్ అయితే యూనివర్సల్ సబ్జెక్ట్‌తో సినిమా చేయగలడని బన్ని భావిస్తున్నాడట. విక్రమ్‌కుమార్‌కు మంచి కథను సిద్ధం చేయమని కోరాడట. ప్రస్తుతం అఖిల్ సినిమా చిత్రీకరణలో ఉన్న విక్రమ్ కుమార్ కథ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడట. అన్నీ అనుకున్నట్లు కుదిరితే అల్లుఅర్జున్, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో సినిమా రూపొందుతోందట. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు విక్రమ్ కుమార్ అంటే ఎలాగూ ఐడియా ఉంది. ఇక తనకు మలయాళంలో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ సినిమా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట బన్ని.