Allu Arjun:బన్నీతో ఫోటో దిగే ఛాన్స్ : పోటెత్తిన ఫ్యాన్స్, చేతులెత్తేసిన నిర్వాహకులు.. ఈవెంట్ క్యాన్సిల్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు తర్వాత చిత్ర సీమలో అడుగుపెట్టిన అల్లు అర్జున్.. తన ప్రతిభతో స్టైలీష్ స్టార్‌గా ఎదిగారు. డ్యాన్స్‌లు, ఫైట్స్ , నటన విషయంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బన్నీకి యూత్‌లో మంచి క్రేజ్ వుంది. ఇక పుష్పతో ఐకాన్‌స్టార్‌గా మారిపోయాడు . ఆ చిత్రంలోని పాటలు, డ్యాన్స్‌లు, సీన్స్ అన్ని దేశాన్ని ఒక ఊపు ఊపాయి. ఈ మధ్యకాలంలో సమాజంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పుష్ప డైలాగ్స్‌తో వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. చివరికి సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు సైతం ‘‘తగ్గేదే లే’’ డైలాగ్‌ని వాడుకున్నారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా వున్నారు అల్లు అర్జున్. ఇటీవలే విశాఖలో షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు బన్నీ. ఆ సమయంలో బన్నీకి ఘనంగా స్వాగతం పలికారు.
అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్న బన్నీ :
ఇదిలావుండగా.. అభిమానులకు సర్‌ప్రైజ్ చేయాలని భావించిన అల్లు అర్జున్ వారితో ఫోటో షూట్ కార్యక్రమాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. తమ అభిమాన హీరోను కలిసే అవకాశం వస్తే.. అది కూడా ఆయనే ఫోటో దిగేందుకు ముందుకు వస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా. ఇక్కడే అదే జరిగింది. విషయం తెలుసుకున్న అభిమానులు ఈవెంట్ జరుగుతున్న వేదిక వద్దకు పోటెత్తారు. దీంతో వారిని కంట్రోల్ చేయడం నిర్వాహకులకు, భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది. చివరికి చేతులెత్తేయడంతో ఫోటో షూట్‌నే రద్దు చేయాల్సి వచ్చింది.
గీతా ఆర్ట్స్ డిజిటల్ హెడ్‌పై ఫ్యాన్స్ గరం:
ఈ ప్రకటనతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. బన్నీని దగ్గరి నుంచి చూడొచ్చనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను బాగా హర్ట్ చేశారంటూ నిర్వాహకులపై మండిపడుతున్నారు. ప్రధానంగా గీతా ఆర్ట్స్, అల్లు అర్జున్ డిజిటల్ అండ్ కంటెంట్ హెడ్ శరత్ చంద్రను ఏకీపారేస్తున్నారు. గత రెండు మూడేళ్ల నుంచి ఇలాగే చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. గతంలో ఆడియో ఫంక్షన్స్, సక్సెస్ మీట్ తాజాగా ఫ్యాన్స్ మీట్‌లోనూ అదే జరిగిందని.. అభిమానుల ఎమోషన్స్‌తో ఆడుకోవద్దని చురకంటిస్తున్నారు. ప్రస్తుతం వేదిక వద్ద అభిమానులు నిరాశతో వెనుదిరిగిన వీడియోలు, వారు కంటతడి పెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
VizAAg Fans Meet Got Cancelled 🥺💔@AlluArjun
— Praveen 🪓 ™ (@_AlluBoyPraveen) February 6, 2023
Anti @imsarathchandra Anna idi 🥺
It's Not The First Time.🥺
It's Repeating From 2-3 Yrs
We're Not Happy With AUDIO Launch, SUCCESS Meet & FANS Meet
Don't Play With Fans Emotions#AlluArjun𓃵 #Pushpa#PushpaTheRise #PushpaTheRule pic.twitter.com/BMHAHv3fiQ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com