తొలిసారి సైరా గురించి బ‌న్నీ కామెంట్‌

  • IndiaGlitz, [Monday,September 30 2019]

మెగాస్టార్ చిరంజీవి అండ్ కాంపౌండ్‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూరంగా ఉండి ఎద‌గాల‌ని అనుకున్నాడు. అయితే మెగా హీరోలే కాదు.. మెగాభిమానులు కూడా బ‌న్నీని ప‌క్క‌న పెట్టేశారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అందుక‌నే సైరా సినిమా ప్ర‌మోష‌న్స్ విష‌యంలో అభిమానులు బ‌న్నీ పోస్ట‌ర్స్ లేకుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నార‌ట‌. అదీగాక సాయితేజ్‌కి పోస్ట‌ర్ అయినా పెడుతున్నారు కానీ బ‌న్నీని ప‌క్క‌న పెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. సైరా ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలోనే బ‌న్నీ త‌న 'అల వైకుంఠ‌పుర‌ములో' ప్ర‌మోష‌న్స్ ఎందుకు చేయ‌డ‌మ‌ని కూడా వారు గుర్రుగా ఉన్నార‌ట‌. అలాగే సైరా వేడుక‌ల‌కు బన్నీ దూరంగా ఉండ‌టంపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఈ విష‌యం బ‌న్నీ వ‌ర‌కు చేరింది. దీంతో బ‌న్నీ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగాడు. తొలిసారి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి గురించి సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేశారు బ‌న్నీ.

''సైరా న‌ర‌సింహారెడ్డి.. మా మెగాస్టార్ చిరంజీవిగారు న‌టించి గొప్ప చిత్రం. తెలుగు సినిమా గ‌ర్వ‌ప‌డాల్సిన రోజుది. నేను చాలా ఏళ్ల క్రితం వెండితెర‌పై మ‌గ‌ధీర చిత్రాన్ని చూసిన‌ప్పుడు చిరంజీవిగారిని కూడా ఇలాంటి ఎపిక్ మూవీలో చూడాల‌నుకున్నాను. నా కోరిక ఈరోజు ఇలా నిజ‌మైంది. ఇలాంటి ఎపిక్ మూవీని మా చిరంజీవిగారితో నిర్మించిన నిర్మాత‌, నా సోద‌రుడు రామ్‌చ‌ర‌ణ్‌కి ధ‌న్య‌వాదాలు.. కృత‌జ్ఞ‌త‌లు. ఆయ‌న లెగ‌సీకి చ‌ర‌ణ్ ఇచ్చిన కానుక‌. ఓ కొడుకు తండ్రికి ఇంత కంటే గొప్ప గిఫ్ట్‌ను ఏం ఇవ్వ‌గ‌ల‌డు. ఎంటైర్ యూనిట్‌కు నా అభినంద‌న‌లు. అలాగే డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డిగారికి ప్ర‌త్యేక‌మైన కృతజ్ఞ‌త‌లు. సైరా మ‌న హృద‌యాల్లో ఎప్ప‌టికీ చెర‌గ‌ని మ్యాజిక్‌ను క్రియేట్ చేయాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.

More News

'ఎంత మంచివాడ‌వురా'కు అక్క‌డ నుండే తీసుకున్నారా?

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా స‌తీశ్ వేగేశ్న కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఎంత మంచి వాడ‌వురా`. ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

సంతోషం సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 వేడుక

సంతోషం సినీ వారపత్రిక 17వ వార్షికోత్సవం, సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 ప్రదానోత్సవం చిత్రసీమ అతిరథ మహారథుల సమక్షంలో, వేలాది మంది ప్రేక్షకుల మధ్య అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది.

కోడెల మరణంతో జగన్ అండ్ కో ఏం సాధించారు? : దేవినేని

మాజీ మంత్రి, నవ్యాంధ్ర తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు నీచ రాజకీయాలకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు.

ఉద్యోగాల కల్పనలో ఏపీ సర్కారు సరికొత్త రికార్డు: సీఎం

నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో చరిత్ర సృష్టించామని... ఇందుకు గర్వంగా ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తొలి నుంచి పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ వస్తున్న

బిగ్ బీ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చెర్రీ

బిగ్ బీ అమితాబ్ బచ్చన్... భారతీయ సినీ చరిత్ర గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా ఆయన గురించి చెప్పుకోవాల్సిందే. సహజమైన నటన, భిన్నమైన పాత్రలతో ఇప్పటికీ ఆకట్టుకుంటున్న