బ‌న్ని నెక్ట్స్ ప్రాజెక్ట్‌

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఇటీవ‌లే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో ప‌ల‌క‌రించారు. ఈ సినిమాలో త‌న పెర్‌ఫార్మెన్స్‌తో అభిమానులనే కాకుండా స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రించారు. ఈ సినిమా విడుద‌లై నెల అవుతున్నా.. బ‌న్నీ చిత్ర‌మేది సెట్స్ పైకి వెళ్ళ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. బ‌న్ని మూడు చిత్రాల‌ను లైన్‌లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ఈ మూడు చిత్రాలు కూడా అగ్ర ద‌ర్శ‌కుల చిత్రాలు కావ‌డం గ‌మ‌నార్హం. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం, అలాగే సురేంద‌ర్ రెడ్డి డైరెక్ష‌న్‌లో ఓ మూవీ చేసేందుకు బ‌న్ని ప్లాన్ చేసుకున్నార‌ట‌.

వీటిలో ముందుగా విక్ర‌మ్ కె.కుమార్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. స్క్రిప్ట్ వ‌ర్క్ తుదిద‌శ‌లో ఉన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే పట్టాలెక్క‌నుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి.

More News

'ఈగ' తేదికే వ‌స్తున్న 'విజేత‌'

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా న‌టించిన తొలి చిత్రం 'విజేత‌'. రాకేశ్ శ‌శి దర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాత సాయి కొర్ర‌పాటి ఈ సినిమాని నిర్మించారు.

మ‌రోసారి తండ్రి అయిన ఎన్టీఆర్‌...

హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి తండ్రి అయ్యారు. ఎన్టీఆర్‌, ప్ర‌ణతిల‌కు మ‌గ‌బిడ్డ పుట్టాడు. 'నా కుటుంబం పెద్దదైంది, మ‌గ‌బిడ్డ‌' అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయ‌డం ద్వారా అస‌లు విష‌యాన్ని అంద‌రికీ తెలిపారు.

సంక్రాంతికి ర‌జ‌నీ సంద‌డి

ఇటీవ‌లే కాలాగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. మంచి వ‌సూళ్ళ‌నే తెచ్చుకుంటోంది.

16 ఏళ్ళు పూర్తిచేసుకున్న నితిన్‌

యువ‌త‌రంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ‌ క‌థానాయ‌కుల్లో నితిన్ ఒక‌రు. ప్రేమ‌క‌థా చిత్రాల‌ల్లోనే ఎక్కువ‌గా రాణించిన నితిన్‌..

ఎన్టీఆర్ పల్ల‌వే?

హీరో సుధీర్ బాబు రేపు ప్రేక్ష‌కుల‌ను 'స‌మ్మోహ‌నం' చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. హీరోగానే కాదు నిర్మాత‌గా కూడా రీసెంట్‌గా త‌న కెరీర్‌లో కొత్త అధ్యాయానికి సుదీర్ తెర‌తీసిన సంగ‌తి తెలిసిందే.