బన్నితదుపరి డేట్ ఫిక్స్
- IndiaGlitz, [Friday,October 26 2018]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా రానుండటం దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రం తర్వాత బన్ని మరో సినిమాను చేయలేదు. కాస్త గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో చాలా కథలనే విన్నాడు. విక్రమ్ కుమార్తో సినిమా చేయాలనుకున్నాడు కూడా.
అయితే చివరకు బన్ని యూ టర్న్ తీసుకుని త్రివిక్రమ్ సినిమా చేయాలనుకున్నాడు. దాదాపు స్క్రిప్ట్ అంతా ఓకే అయ్యింది. 'సోను కె టిటు కి స్వీటీ' సినిమా లైన్ను తీసుకుని తెలుగు నెటివిటీకి తగినట్లు త్రివిక్రమ్ మారుస్తున్నాడు.
ఈ కథా హక్కులు టీ సిరీస్ దగ్గర ఉండటంతో వాళ్లు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యులవుతున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ డిసెంబర్ 11 నుండి జరగనుంది. సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే వెలువడనుంది.