బన్ని నెక్ట్స్ మూవీ ఫిక్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సరైనోడు సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బన్ని మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే సుబ్రమణ్యం ఫర్ సేల్ తర్వాత హారీష్ శంకర్ బన్నితో సినిమా చేయాలని ఓ కథ రెడీ చేసాడు.
ఇప్పుడు బన్ని..హారీష్ శంకర్ తో సినిమా చేసిన తర్వాత విక్రమ్ కుమార్ తో సినిమా చేయాలా..? లేక హారీష్ శంకర్ తో సినిమా చేయకుండా విక్రమ్ కుమార్ తో చేయాలా అని తెగ ఆలోచిస్తున్నాడట. ఏది ఏమైనా...బన్ని విక్రమ్ కుమార్ తో సినిమా చేయడం ఖాయం. కాకపోతే హారీష్ శంకర్ తో మూవీ చేస్తాడా..? లేదా అనేదే డౌట్. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com