Allu Arjun:అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో అల్లు అర్జున్.. టాలీవుడ్ జనాలకు ఇక పునకాలే
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. టాలీవుడ్ జనాలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న క్రేజీ కాంబో సెట్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా , అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీతో వున్నారు. సాదాసీదా హీరోగా వున్న విజయ్ దేవరకొండను ఆల్ ఇండియా రేంజ్‌లో స్టార్‌గా నిలబెట్టారు సందీప్. వినూత్నమైన కథ, స్క్రీన్ ప్లే, టేకింగ్.. హీరో వెరియేషన్ ఇలా అన్ని కలిపి అర్జున్ రెడ్డికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేశాయి. మరి అలాంటి సందీప్ రెడ్డి.. ఐకాన్ స్టార్‌ని ఎలా ప్రజెంట్ చేస్తారోనని టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 కోసం ఎదురుచూస్తోన్న దేశం:
ఇదిలావుండగా.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2లో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా కోసం టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. పుష్ప పార్ట్ 1లోని పాటలు, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ దేశాన్ని ఎంతగా వెర్రెక్కించాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్ట్ 2లో ఎలాంటి ఎలిమెంట్స్ వుంటాయోనని ఆసక్తి నెలకొంది. సౌత్ కంటే నార్త్ ప్రేక్షకులు పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు బన్నీ. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు.
రణ్‌బీర్ కపూర్, ప్రభాస్‌లో సినిమాలు చేస్తోన్న సందీప్ రెడ్డి:
ఇటు సందీప్ రెడ్డి వంగా విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ముందు, ఆ వెనుక సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయడానికి సందీప్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మహేశ్ చేతిలో వరుస సినిమాలు వుండటంతో ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ యువ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సందీప్. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. దీనితో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సందీప్ రెడ్డి మరో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout