కొత్త ఇల్లు కట్టుకుంటున్న బన్నీ.. పేరేంటో తెలుసా?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ ఇంటికి బ్లెస్సింగ్ అనే పేరు పెట్టారు. ఈ ఇంటికి భూమి పూజ చేశారు. ఈ విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. బన్నీ, స్నేహారెడ్డి, అయాన్, అర్హ భూమి పూజ కూడా చేశారు. ఈ ఫోటోలన్నింటినీ బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఇటీవల బన్నీ ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో కొత్త క్యారీ వ్యాన్‌ను సిద్ధం చేసుకున్నారు. అలాగే బన్నీ తన కథలు వినడానికి ఏఏ పేరుతో ఓ ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకున్న సంతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఇల్లుకూడా కట్టుకుంటున్నారు.
ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో `అల...వైకుంఠపురములో..` సినిమా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో టుబు, జయరాం, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లోనటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో సాంగ్ కోటి వ్యూస్‌ను దాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత వెంటనే సుకుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com