బన్ని కొత్త అవతారం
Send us your feedback to audioarticles@vaarta.com
కథానాయకుడుగా అల్లు అర్జున్ స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్ని.. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా చేస్తున్నారు. రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్నారు. కాగా, మరో నూతన దర్శకుడికి కూడా బన్ని అవకాశమిస్తున్నారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ సారి హీరోగా కాదు.. నిర్మాతగా. తన తండ్రి అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పతాకంపై సినిమాలను నిర్మిస్తున్నప్పటికీ.. రామ్ చరణ్ లాగా తను కూడా నిర్మాతగా మారి సినిమాలను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట బన్ని.
బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఓ కథతో అను కె.రెడ్డి ఓ స్క్రిప్ట్‌ని బన్నికి చెప్పారని.. ఆ కథ తనకి ఎంతగానో నచ్చడంతో తానే నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని చేసేందుకు ముందుకు వచ్చారట ఈ మెగా ఫ్యామిలీ కథానాయకుడు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలిసింది. హీరోగా నిరూపించుకున్న బన్ని.. నిర్మాతగానూ సక్సెస్ అవుతారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments