ఫస్ట్ ఇంపాక్ట్ లో ఏం ఉంటుందంటే..

  • IndiaGlitz, [Tuesday,December 26 2017]

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య‌. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కులు విశాల్ - శేఖ‌ర్ బాణీలు అందిస్తున్నారు. చింత‌కాయ‌ల ర‌వి త‌రువాత దాదాపు ప‌దేళ్ల గ్యాప్‌తో విశాల్ - శేఖ‌ర్ మ్యూజిక్ అందిస్తున్న తెలుగు చిత్ర‌మిదే కావ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. జ‌న‌వ‌రి 1న నా పేరు సూర్య ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇంత‌కీ ఫ‌స్ట్ ఇంపాక్ట్‌లో ఏముంటుందో అనే చ‌ర్చ టాలీవుడ్‌లో న‌డుస్తోంది. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ ఫ‌స్ట్ ఇంపాక్ట్‌లో సూర్య పాత్ర కోసం అల్లు అర్జున్ క‌ష్ట‌ప‌డిన తీరుని చూపించ‌బోతున్న‌ట్లుగా తెలిసింది. అలాగే, ఈ ఫ‌స్ట్ ఇంపాక్ట్‌కి విశాల్ శేఖ‌ర్ అందించిన నేప‌థ్య‌సంగీతం హైలైట్‌గా నిలుస్తుంద‌ని తెలిసింది. కాగా, ఏప్రిల్ 27న నా పేరు సూర్య ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.