కీలక సన్నివేశాల చిత్రీకరణలో 'నా పేరు సూర్య'
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ లు జంటగా వక్కంతం వంశి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ , శరత్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 5 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారు. ఈ సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత శిరీషా శ్రీధర్ మాట్లాడుతూ.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" నవంబర్ 5 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారు. విశాల్ శేఖర్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నారు. అను ఇమ్యాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. అత్యంత భారీ తారాగాణం, సాంకేతిక నిపుణులతో చిత్రాన్ని ఎక్కాడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరిస్తున్నాము. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుదల చేయటానికి సన్నాహలు చేస్తున్నాము. అని అన్నారు
చిత్ర సమర్పకుడు నాగబాబు మాట్లాడుతూ... బన్నీ కెరీర్ లో హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. దర్శకుడు వక్కంతం వంశీ అద్భుతమైన కథ కథనం తో కంప్లీట్ ప్యాకేజీ అందిస్తున్నాడు. నవంబర్ 5 నుంచి నెల రోజుల పాటు హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 27, 2018 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అని అన్నారు.
సహ నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ కి ఏప్రిల్ 27, 2018 పెద్ద పండగ చేసుకునే రోజు. ఆ రోజు అత్యధిక థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా విడుదల చేస్తున్నాం. వక్కంతం వంశీ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. నవంబర్ 5 నుంచి మరో కీలక మైన షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నాం. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com