నా బెస్ట్ సెల్ఫీ ఇదే - అల్లు అర్జున్..!

  • IndiaGlitz, [Thursday,December 08 2016]

బెంగుళూరు బ్లాష్ట‌ర్స్ జ‌ట్టుకు అల్లు అర్జున్ స‌హ యాజ‌మానిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా లెజెండ్రి క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ను స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క‌లిసారు. అల్లు అర్జున్ ఈ విష‌యాన్నిట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ...స‌చిన్ టెండూల్క‌ర్ తో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసి ఇప్ప‌టి వ‌ర‌కు దిగిన సెల్ఫీలో బెస్ట్ సెల్ఫీ ఇది. స‌చిన్ తో క‌లిసి బెంగుళూరు బ్లాష్ట‌ర్స్ జ‌ట్టుకు కో ఓన‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నందుకు సంతోషం వ్య‌క్తం చేసారు. అల్లు అర్జున్ బెస్ట్ సెల్ఫీలో అల్లు అర్జున్ తో పాటు స‌చిన్, బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వ‌రీనాధ్, నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ ఉన్నారు.