బన్ని సినిమాలో విలన్ గా...

  • IndiaGlitz, [Wednesday,June 28 2017]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌లో ఉంది. ఈ సినిమాలో బ‌న్ని స‌ర‌స‌న నివేద థామ‌స్ హీరోయిన్‌గా న‌టించ‌నుందని స‌మాచారం.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో బ‌న్నికి విల‌న్‌గా శ‌ర‌త్‌కుమార్‌ను న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయట‌. అన్ని అనుకున్న‌ట్లు కుదిరితే గ‌తంలో బ‌న్ని సినిమాలో బ‌న్నితండ్రి పాత్ర‌లో న‌టించిన శ‌ర‌త్‌కుమార్ ఇప్పుడు విల‌న్‌గా న‌టిస్తాడు. డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ త‌ర్వాత బ‌న్ని చేయ‌నున్న సినిమా ఇది. ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.