బన్ని సినిమా ముందుకా? వెనక్కా?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేసవిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ చిత్రానికి నిర్మాత. అను ఇమాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తుంది.
ఈ సినిమా రిలీజ్ డేట్కే మహేష్, కొరటాల శివ `భరత్ అను నేను` సినిమా రిలీజ్ కానుంది. అలాగే రజనీకాంత్ `2.0` కూడా విడుదలకు సిద్ధంగా ఉంటుంది. ఈ పోటీ వల్ల బాక్సాఫీస్ వద్ద ఎవరో ఒకరు అనవసరంగా నష్టపోయే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. కాబట్టి బన్నియే ఇన్షియేట్ తీసుకుని తన సినిమాను ముందుగానే బాక్సాఫీస్ వద్దకు తీసుకు రావాలనుకుంటున్నాడని సమాచారం. మరి టర్న్ ఎలా తీసుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments