బన్ని సినిమా ముందుకా? వెనక్కా?
- IndiaGlitz, [Tuesday,January 23 2018]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ వేసవిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. లగడపాటి శిరీషా శ్రీధర్ ఈ చిత్రానికి నిర్మాత. అను ఇమాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తుంది.
ఈ సినిమా రిలీజ్ డేట్కే మహేష్, కొరటాల శివ 'భరత్ అను నేను' సినిమా రిలీజ్ కానుంది. అలాగే రజనీకాంత్ '2.0' కూడా విడుదలకు సిద్ధంగా ఉంటుంది. ఈ పోటీ వల్ల బాక్సాఫీస్ వద్ద ఎవరో ఒకరు అనవసరంగా నష్టపోయే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. కాబట్టి బన్నియే ఇన్షియేట్ తీసుకుని తన సినిమాను ముందుగానే బాక్సాఫీస్ వద్దకు తీసుకు రావాలనుకుంటున్నాడని సమాచారం. మరి టర్న్ ఎలా తీసుకుంటుందో చూడాలి.