బన్ని రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎవడు`, రేసు గుర్రం`, సన్నాఫ్ సత్యమూర్తి`, రుద్రమదేవి`.. ఇలా వరుసగా పాజిటివ్ రిజల్ట్స్‌తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ స్టైలీష్ స్టార్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'సరైనోడు'(పరిశీలనలో ఉన్న టైటిల్)గా ముస్తాబవుతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమాలో అంజలి కూడా స్పెషల్ సాంగ్ చేయబోతుంది. సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లుఅరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 8న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. లవ్ అండ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా కాన్సెప్ట్ తో సినిమా రూపొందుతోందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments