ఏడు భాషల్లో అల్లు అర్జున్ సందడి

  • IndiaGlitz, [Monday,January 22 2018]

“ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు”.. ఈ మాట స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌కి సరిగ్గా సరిపోతుంది. టాలీవుడ్‌లో తన సినిమాలతో ప్రేక్షకులని ఉర్రూతలూగించిన ఈ మెగా హీరో...మాలీవుడ్‌లోనూ త‌న చిత్రాల అనువాదాల‌తో అభిమానులని సంపాదించుకున్నారు. అంతేకాకుండా.. తాజాగా విడుదలైన సరైనోడు', డి.జె' వంటి సినిమాలు హిందీ ఆడియన్స్‌ని కూడా ఆక‌ట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలో.. బన్ని నటిస్తున్న కొత్త చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాని ఏడు భారతీయ భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు.

ఈ విషయమై బన్నిని సంప్రదించగా....బన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠి, భోజపురి వంటి ఏడు భాషల్లో విడుదల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమ‌వుతున్న ఈ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో బన్ని సైనికుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయికగా నటిస్తున్న ఈ సినిమాని లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 27న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి నాగబాబు సమర్పకులు.

More News

వాలీబాల్ ఆట నేపథ్యంలో..

బెల్లంకొండ శ్రీనివాస్..నటించింది మూడు సినిమాలే అయినా తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసుకున్న యువ కథానాయకుడు.

మార్చిలో 'టాక్సీవాలా'

సంచ‌ల‌న విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' సినిమా తర్వాత.. ఆ చిత్ర క‌థానాయ‌కుడు విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ఎప్పుడు వస్తుందా అని అత‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ అర‌డ‌జ‌ను చిత్రాల‌తో బిజీగా ఉన్నా.. వీటిలో 'టాక్సీవాలా' ముందుగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

మళ్ళీ బాలయ్య తోనే..

కొన్ని హిట్ కాంబినేషన్లు వెండితెరపై రిపీట్ అయితే చాలు..సినిమా ఫలితం గురించి పెద్దగా ఆలోచించక్కర్లేదు.

వెంకీ త‌మ్ముడిగా రోహిత్‌?

సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

ముంబయికి వెళ్ళనున్న నాగ్, వర్మ

‘శివ’వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సంచలనానికి తెరలేపిన ద్వయం కింగ్ నాగార్జున,దర్శకుడు రాంగోపాల్ వర్మ.