ఏడు భాషల్లో అల్లు అర్జున్ సందడి
Send us your feedback to audioarticles@vaarta.com
“ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు”.. ఈ మాట స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కి సరిగ్గా సరిపోతుంది. టాలీవుడ్లో తన సినిమాలతో ప్రేక్షకులని ఉర్రూతలూగించిన ఈ మెగా హీరో...మాలీవుడ్‌లోనూ తన చిత్రాల అనువాదాలతో అభిమానులని సంపాదించుకున్నారు. అంతేకాకుండా.. తాజాగా విడుదలైన సరైనోడు`, డి.జె` వంటి సినిమాలు హిందీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో.. బన్ని నటిస్తున్న కొత్త చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` సినిమాని ఏడు భారతీయ భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు.
ఈ విషయమై బన్నిని సంప్రదించగా....బన్ని కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠి, భోజపురి వంటి ఏడు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాలీవుడ్లో కథనాలు వినిపిస్తున్నాయి. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బన్ని సైనికుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 27న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి నాగబాబు సమర్పకులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout