థాయ్‌లాండ్‌కి బన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధమవుతుంది. శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను ముందుగా నల్లమల అడవుల్లో చిత్రీకరించాలని అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ కీలక సన్నివేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను థాయ్‌లాండ్ అడవుల్లో చిత్రీకరించాలనుకుంటున్నారట.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఇందులో మెయిన్ విలన్‌గా నటించనున్నాడట. ఎర్రచందనం స్మగ్లింగ్, చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం కావడంతో నటీనటులను చిత్తూరు యాస నేర్చుకోవాలని సుకుమార్ సూచించాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం కావడంతో పాటు రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రమిది, దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం `అల...వైకుంఠపురములో...`. త్రివిక్రమ్ దర్శకుడు. సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేస్తున్నారు నిర్మాతలు అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com