థాయ్‌లాండ్‌కి బ‌న్నీ

  • IndiaGlitz, [Monday,November 18 2019]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న హ్యాట్రిక్ మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతుంది. శ‌ర‌వేగంగా ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ముందుగా న‌ల్ల‌మ‌ల అడవుల్లో చిత్రీక‌రించాల‌ని అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ కీల‌క స‌న్నివేశాల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను థాయ్‌లాండ్ అడ‌వుల్లో చిత్రీక‌రించాల‌నుకుంటున్నార‌ట‌.

మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి ఇందులో మెయిన్ విల‌న్‌గా న‌టించ‌నున్నాడ‌ట‌. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్‌, చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం కావ‌డంతో న‌టీన‌టుల‌ను చిత్తూరు యాస నేర్చుకోవాల‌ని సుకుమార్ సూచించాడు. ఆర్య‌, ఆర్య 2 త‌ర్వాత బ‌న్నీ, సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న చిత్రం కావడంతో పాటు రంగ‌స్థ‌లం వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది, దీంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'అల‌...వైకుంఠ‌పుర‌ములో...'. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు. సినిమా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేస్తున్నారు నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, ఎస్‌.రాధాకృష్ణ.