Pushpa 2 : ఫ్యాన్స్ గోల .. పుష్ప 2 డైలాగ్ లీక్ చేసిన బన్నీ , ఒకటే ముక్క.. వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
బాహుబలి సిరీస్ తర్వాత తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. దేశం మొత్తం పుష్ప పాటలు, డైలాగ్స్‌తో ఊగిపోయింది. ఈ మధ్యకాలంలో సమాజంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తగ్గేదే లే అంటూ గడ్డం కింద చెయ్యి పెట్టి డైలాగ్ చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 17, 2021న విడుదలైంది. రూ. 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.400 కోట్ల వసూళ్లు సాధించి అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
బేబీ సక్సెస్ మీట్‌కు గెస్ట్‌గా బన్నీ :
ప్రస్తుతం పుష్పకు సీక్వెల్‌గా పుష్ప 2ను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, లుక్స్, గ్లింప్స్‌తో సినిమాపై అంచాలను భారీగా పెంచారు మేకర్స్. అయితే ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చి చాలాకాలమే అవుతోంది. ఈ క్రమంలో పుష్ప 2 లోని డైలాగ్‌ని లీక్ చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ‘‘బేబీ’’ సినిమా అప్రిసియేషన్ మీట్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
పుష్ప 2 డైలాగ్ చెప్పాలంటూ ఫ్యాన్స్ గోల :
బేబీ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ జోష్ నింపారు బన్నీ. తన స్పీచ్ ముగుస్తుందనగా ‘పుష్ప 2’లోని డైలాగ్ కావాలంటూ ఫ్యాన్స్ గోల చేయడంతో వారి కోరికను మన్నించి ఓ డైలాగ్ వదిలారు ఐకాన్ స్టార్. ‘‘ ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది.. పుష్పాగాడి రూల్'' అంటూ బన్నీ చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్‌తో ఫ్యాన్స్ ఈలలు, కేకలు పెట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అనసూయ, సునీల్ , జగపతి బాబు, జగదీష్ ప్రతాప్ భండారి, ప్రకాష్ రాజ్, రావు రమేష్ , అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments