అల్లు అర్జున్, కల్యాణ్ రామ్ కార్లకు బ్లాక్ ఫిల్మ్ .. చలానా వేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
Send us your feedback to audioarticles@vaarta.com
కేంద్ర మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. నల్ల ఫిల్మ్‌లు పెట్టుకోవడం, వివిధ హోదాలను సూచిస్తున్న స్టిక్కర్లు కలిగిన వాహనాలపై సైతం దృష్టి సారిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతోన్న పోలీసులు బ్లాక్ ఫిల్మ్‌లు తొలగించడంతో పాటు వారికి జరిమానా కూడా విధిస్తున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొద్ది రోజుల క్రితం బోధన్ ఎమ్మెల్యే కుమారుడి కారు ఓ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఘటన అనంతరం పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా సినీనటులు అల్లు అర్జున్, కల్యాణ్ రామ్‌లకు చెందిన కార్లకు బ్లాక్ ఫిల్ములు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ బ్లాక్ ఫిల్మ్ లేయర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. అనంతరం చలానాలు కూడా విధించారు. వీరిద్దరి కార్లకు రూ.700 చొప్పున జరిమానా విధించినట్లుగా తెలుస్తోంది.
దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు మాట్లాడుతూ.. శనివారం తాము జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని నీరూస్ కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నామని.. ఆ సమయంలోనే అల్లు అర్జున్, కల్యాణ్ రామ్‌కు చెందిన కార్లు అటుగా వెళ్తుంటే అడ్డుకున్నామని చెప్పారు. ఆ రెండు కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించి రూ.700 చొప్పున చలాన్లు విధించామని వెల్లడించారు.
ఇకపోతే.. నల్ల ఫిల్మ్‌తో పాటు వాహనాలపై వివిధ హోదాలతో కూడిన స్టిక్కర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కార్లు, బైకుల విండ్ షీల్డ్‌లపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్, ప్రభుత్వ వాహనం, ఆర్మీ, పోలీస్, ప్రెస్, ఇతర సంస్థలకు సంబంధించిన స్టిక్కర్లు వేసుకుంటే ఎంవీ యాక్ట్ ప్రకారం ప్రకారం తొలగిస్తున్నామని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు, ఆయా హోదాలో ఉన్న వారికి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com