సెట్స్‌లోకి బన్నీ.. కాన్సెప్ట్ ఇదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’. ప్యాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో రూపొందుతోన్నఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. ఎక్కువ భాగం చిత్రీకరణ అడవుల్లోనే జరగనుంది. అందుకోసం రాజమండ్రికి సమీపంలో ఉండే మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ నవంబర్ 10 నుండి స్టార్ట్ చేశారు. బన్నీ ఈరోజు సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. తన ఎంట్రీ విషయాన్ని అల్లు అర్జున్ నడుస్తున్న ఫొటో(వెనుక నుండి) పోస్ట్ చేయడం ద్వారా రివీల్ చేసింది.
చిత్తూరు జిల్లాశేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్‌పైనే ఈసినిమా ప్రధాన కథాంశం రన్ అవుతుందట. ఇందులో బన్నీ పాత్రను.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే కూలీగా చేరి తర్వాత లారీ డ్రైవర్‌గా మారి, తర్వాత పెద్ద స్మగ్లర్ రేంజ్‌కు ఎలా చేరుకున్నాడనేలా సుక్కు తీర్చిదిద్దారట. బన్నీ లుక్‌కు చాలా మాస్‌గా డిజైన్ చేసింది చిత్ర యూనిట్ పుష్ప అనే యువకుడు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కూలీ నుండి స్మగ్లర్‌గా ఎలా ఎదిగాడు.. ఎర్రచందనంను పోలీసుల కన్నుగప్పి ఎలా స్మగుల్ చేశాడు అనే అంశాలతో సుక్కు ఆసక్తికరంగా తెరకెక్కించనున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com