మహేష్ ని దాటేసిన బన్ని..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. అలాగే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన కేరళ, కర్నాటకలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే... ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోర్బ్స్ పత్రిక ప్రతి సంవత్సరం ఇండియాలో టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది.
ఈ సంవత్సరం రిలీజ్ చేసిన జాబితాలో 33 స్ధానంలో సూపర్ స్టార్ మహేష్, 43 స్ధానంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. అయితే ఫేమ్ ర్యాంక్ లో మాత్రం మహేష్ 74వ స్ధానంలో నిలిస్తే...స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ 59వ స్ధానంలో నిలవడం విశేషం. కేరళ, కర్నాటకలో బన్నికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉండడం, దీనికి తోడు సోషల్ మీడియాలో బన్ని బాగా ఏక్టీవ్ గా ఉండడం తదితర కారణాల వలన ఫేమ్ ర్యాంక్ లో మహేష్ కన్నా ముందు 59వ స్ధానం దక్కించుకున్నాడు బన్ని.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com