ఆహా ఓటీటీ... అల్లు అర్జున్‌ని దింపుతోన్న అల్లు అరవింద్, నిజమైతే ఫ్యాన్స్‌కి పండగే
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాలు , షూటింగ్‌లు, వ్యాపారాలతో బిజీగా వుండే స్టార్స్ ఇటీవలి కాలంలో తమ పంథా పూర్తిగా మార్చేశారు. ఒకరి తర్వాత ఒకరు బుల్లితెర మీద హోస్ట్‌లుగా రాణిస్తున్నారు. తద్వారా ఇంటిల్లిపాదికి దగ్గరవుతున్నారు. అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ఎన్టీఆర్, నాని, కమల్ హాసన్ వంటి స్టార్స్ హోస్ట్‌లు అదరగొడుతున్నారు. వీరిని చూసి రానున్న రోజుల్లో మరింత మంది వ్యాఖ్యాతలుగా మారుతున్నారు. ఓటీటీల రాకతో ఈ కల్చర్ మరింత ఎక్కువైంది.
తెలుగులో రంగ ప్రవేశం చేసిన ఆహా ఓటీటీ మంచి ఆదరణతో బడా సంస్థలకు సైతం పొటీ ఇస్తోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ.. ‘‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’’ పేరుతో చేసిన టాక్ షోకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. తనదైన శైలిలో స్టార్స్‌ను ఇంటర్వ్యూ చేసి షోను రక్తి కట్టించారు బాలయ్య. ఈ షో హిట్ అవ్వడంతో ఆహా ఓటీటీని మరింత పాపులర్ చేయాలని ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారట నిర్వాహకులు. ఇందుకోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను రంగంలోకి దింపబోతున్నారట. ఆయన హోస్ట్‌గా ఆహాలో ఓ టాక్ షో మొదలుపెట్టాలన్న ప్లాన్‌లో ఉన్నట్టుగా ఫిలింనగర్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
అయితే అది అంత ఈజీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందుచేత ఈ టాక్ షో పట్టాలెక్కే వరకు నమ్మలేం. కాకపోతే సొంత సంస్థ కాబట్టి.. వీలు కుదిరితే దీనికి బన్నీ ఓకే చెప్పవచ్చు. ఏది ఏమైనా దీనిపై ఆహా ఒక ప్రకటన చేసే వరకు ఓ నిర్ణయానికి రాలేం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com