సుప్రీమ్ సినిమాలో అల్లు హీరో..

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. సాయిథ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా ఈ చిత్రంలో న‌టిస్తుంది. ఈ చిత్రంలో క్లైమాక్స్ సీన్ లో అల్లు హీరో గెస్ట్ రోల్ లో క‌నిపిస్తాడ‌ట‌.
ఇంత‌కీ అల్లు హీరో ఎవ‌ర‌నుకుంటున్నారా..? స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాదండీ...అల్లు శిరీష్. ఏదో కావాల‌ని పెట్టిన‌ట్టు కాకుండా సీన్ డిమాండ్ చేయ‌డం వ‌ల‌నే అల్లు శిరీష్ తో గెస్ట్ రోల్ చేయిస్తున్నార‌ట‌. సుప్రీమ్ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ ను అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ సొంతం చేసుకుంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న సుప్రీమ్ సినిమాని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.