చిరంజీవి సినిమాలో బన్నీ..!?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమాను ఆగస్ట్ 14 లేదా 15న విడుదల చేస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చిరు 152లో యంగ్ రోల్లో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించనున్నాడని.. ఆయన పాత్ర నక్సలైట్ పాత్ర అని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్న విషయం విదితమే. అంతేకాదు.. చెర్రీ ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తుండటంతో సినిమా విడుదలయ్యే వరకు మరో సినిమాలో చరణ్ నటించకూడదనేది కండీషన్ అట. దీంతో చరణ్ కోసం జూన్, జూలై వరకు కొరటాల అండ్ టీమ్ వెయిట్ చేయాల్సి వస్తుందట. కాబట్టి ఎంటైర్ షూటింగ్ వాయిదా పడుతుందని గుసగుసలు వినపడుతున్న టైమ్‌లో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగుచూసింది.
చెర్రీ ఔట్.. బన్నీ ఇన్!?
తండ్రి సినిమా నుంచి చెర్రీ ఔటయ్యాడని.. అంటే నటించట్లేదట. అయితే చెర్రీ స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ రంగంలోకి దిగారట. అంటే యంగ్ మెగాస్టార్‌గా బన్నీ నటించడానికి సిద్ధమైపోయారన్న మాట. సందేశంతో కూడిన వినోదభరిత చిత్రం కావడంతో బన్నీ ఈ సాహసం చేస్తున్నాడట. ఇప్పటికే కొరటాల కూడా బన్నీని తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చాడట. అంతేకాదు.. యంగ్ మెగాస్టార్ నటించాలని సంప్రదించగా ఏ మాత్రం ఆలోచించని బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆ పాత్రను చేయడానికి తెగ ఉత్సాహం చూపుతున్నాడట.
మెగా ఫ్యాన్స్ అంగీకరిస్తారా!?
కాగా.. బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆయన కూడా బిజిబిజీగా గడుపుతున్నాడు. మరి తండ్రి సినిమాలో నిజంగానే చెర్రీ అవకాశం పోగొట్టుకున్నాడా..? లేదా ‘ఆర్ఆర్ఆర్’లో చెర్రీకి సంబంధించిన సన్నివేశాలన్నీ అయిపోయాక నిదానంగా చేస్తారా..? లేకుంటే నిజంగానే బన్నీనే తీసుకోవాడినికి చిరు-కొరటాల ఫిక్సయ్యారా అనేది తెలియాలంటే ఇటు చిత్రబృందం లేదా.. బన్నీ నుంచి రియాక్షన్ వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి. ఒక వేళ ఇదే జరిగితే బన్నీ నటించడానికి మెగా ఫ్యాన్స్ అంగీకరిస్తారా లేదా అనేది కూడా డౌటే. ఎందుకుంటే ఈ మధ్య బన్నీ సొంత ఫ్యాన్ ట్యాగ్ కోసం తెగ తాపత్రయపడుతున్నాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout