బ‌యోపిక్‌లో బ‌న్ని

  • IndiaGlitz, [Friday,September 07 2018]

ఇండియాలో క్రికెట్‌కు క్రేజ్ తీసుకొచ్చిన ఆట‌గాళ్ల‌లో ముఖ్యుడు క‌పిల్‌దేవ్‌. 1983 క‌పిల్ డెవిల్స్ పేరుతో ఏకంగా వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డం విశేషం. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హ‌వా జోరుగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో క‌పిల్‌దేవ్ బయోపిక్‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి విదిత‌మే. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌, సైమా అవార్డ్స్ ఫౌండ‌ర్ విష్ణు ఇందూరి 1983 వర‌ల్డ్‌క‌ప్ విన్నింగ్ టీంపైనే సినిమాను రూపొందించ‌బోతున్నాడ‌ట‌.

అందులో క‌పిల్‌దేవ్‌గా బాలీవుడ్ స్టార్ ర‌ణ‌వీర్ సింగ్ న‌టించ‌బోతున్నారు. కాగా ఈ సినిమాకు సంబ‌ధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రానికి '83' అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. క‌పిల్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీమ్‌లో చెన్నైకి చెందిన శ్రీకాంత్ ఓపెన‌ర్‌గా కీల‌క పాత్ర పోషించారు. ఈ పాత్ర‌లో టాలీవుడ్‌కి చెందిన అల్లుఅర్జున్ న‌టించ‌బోతున్నార‌ట‌. ఈ చిత్రానికి క‌బీర్‌ఖాన్ ద‌ర్శ‌కుడు.