వరుణ్ తేజ్ లుక్ కి 'పుష్ప'రాజ్ ఫిదా.. బన్నీ స్పెషల్ సర్ ప్రైజ్!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వెండితెరపై బాక్సింగ్ పంచ్ లని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గని చిత్ర యూనిట్ కి స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. గని సెట్స్ ని బన్నీ సందర్శించాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బన్నీ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. బన్నీ సోదరుడు అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డెబ్యూ దర్శకుడు కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
'గని సెట్స్ కి వెళ్ళాను. వరుణ్ తేజ్ కి నా బెస్ట్ విషెస్. న్యూ లుక్ లో వరుణ్ కిల్లింగ్ అనిపించే విధంగా ఉన్నాడు. నా సోదరుడు అల్లు బాబీ, బ్రదర్ ఇన్ లా సిద్ధూ ముద్దా నిర్మాతలుగా కొత్త జర్నీ ప్రారంభించారు. గని చిత్రంతో మీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద నాకౌట్ పంచ్ ఇస్తారని ఆశిస్తున్నా' అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.
ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారు. దబంగ్ 3 ఫేమ్ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు. కెరీర్ ఆరంభం నుంచి వరుణ్ తేజ్ ప్రత్యేకమైన కథలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. బాక్సింగ్ ఆటగాడిగా కనిపించడం కోసం వరుణ్ తన మేకోవర్ మార్చుకున్నాడు. వరుణ్ లుక్ చూసి బన్నీనే థ్రిల్ ఫీలయ్యాడంటే వరుణ్ కష్టం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ పుష్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
In the sets of #Ghani . My best wishes to my brother @varunkonidela7 . He’s Killing it with his new avatar ?? . And my best wishes to director Kiran garu and the entire team . My love & wishes to both the new producers . pic.twitter.com/04UTVAWG1t
— Allu Arjun (@alluarjun) July 23, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments