హాట్ స్టార్ నూతన ప్రచారాన్ని ప్రారంభించిన అల్లు అర్జున్..
Send us your feedback to audioarticles@vaarta.com
భారతదేశపు అతి పెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను లక్ష్యంగా చేసుకుంది.స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. ఉత్సాహపూరితమైన తెలుగు సినిమాలు మరియు షోస్ ను ఆవిష్కరించిన హాట్ స్టార్ అన్నీపూర్తి ఉచితంగా అందిస్తుంది. భారతదేశపు అతి పెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్, భారతదేశంలో ఎనిమిది భాషల్లో 80 వేల గంటల ప్రపంచ శ్రేణి వినోద కంటెంట్ ను అందిస్తున్నహాట్ స్టార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని తమ ప్రాంతీయ భాషా ప్రేక్షకులకు మరింతగా చేరువవుతుంది. హాట్ స్టార్, ఇప్పుడు 6 వేల గంటలక పైగా కంటెంట్ ను తెలుగులో అందిస్తుంది. దీనిలో తాజా చిత్రాలు.. క్లాసిక్ గా నిలిచిన తెలుగు చిత్రాలు, పాపులర్ టీవీ షోలు ను అందిస్తుంది.
హాట్ స్టార్ తో ఈ అనుబంధం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో హాట్ స్టార్ ముఖ చిత్రంగా నేను నిలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది స్ట్రీమింగ్ సర్వీస్. నేను తరుచుగా దీనిని వాడుతుంటాను. అదీ కాకుండా ఈ బ్రాండ్ ఇటీవలి కాలంలో వచ్చింది. ఇది పూర్తిగా ఆకట్టుకునే రీతిలో ఉంటుంది. నేను షూటింగ్ తో బిజీగా ఉన్నప్పుడు స్పోర్ట్స్ స్కోర్ లను తెలుసుకోవడంలో నాకు హాట్ స్టార్ సహాయపడుతుంది. నా వ్యానిటీ వ్యాన్ లో భారీ స్ధాయి టెలివిజన్ సెట్ నాకు అవసరం లేదు. నా ఫోన్ లో హాట్ స్టార్ ఉంటే చాలు ప్రతిదీ మనం చూడవచ్చు అన్నారు.
సౌత్ స్టార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కె మాధవన్ మాట్లాడుతూ...మా బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్ ను ప్రకటిస్తుండటం పట్ల మేం చాలా ఆనందంగా ఉన్నాం. ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ల్లో హాట్ స్టార్ వీక్షకుల సంఖ్యను విస్తృతం చేయడంలో సహాయపడుతుంది. భారతదేశపు అతి పెద్ద డిజిటల్ కంటెంట్ ఫ్లాట్ ఫామ్ హాట్ స్టార్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో సుపీరియర్ డిజిటల్ సేవలను బ్రాండ్లతో పాటుగా తెలుగు సినిమాలు, టెలివిజన్ ఎకో సిస్టమ్ కు అందించడం ద్వారా స్ధిరీకరించుకోవాలని భావిస్తుంది అన్నారు.
అజిత్ మెహన్, సీఈవో హాట్ స్టార్ మాట్లాడుతూ...గత 15 నెలలుగా హాట్ స్టార్, యువ భారతానికీ ప్రాధమిక స్ర్కీనింగ్ గా తనకు తాను నిలిచింది.అత్యుత్తమ తెలుగు సినిమాలు మరియు టీవీ షోలను వినియోగదారులకు పూర్తి ఉచితంగా అందిస్తున్న ఒకే ఒక్క వేదికగా మేం నిలిచాం. దేశంలోని ఈ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి, అత్యున్నత కంటెంట్ ను వినియోగించాలని ఆరాటపడే ఆతృత కలిగిన వినియోగదారులకు అసాధారణ ఆఫరింగ్ అందించడానికి మేం పూర్తి ఆసక్తితో ఉన్నాం. హాట్ స్టార్ లో 290 కు పైగా తెలుగు చిత్రాలు, 34 టీవీ షోలు ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఫామ్ పై లభిస్తున్న అత్యంత ప్రాచుర్యం పొందిన చిత్రాల్లో కంచె, భలే భలే మగాడివోయ్, సన్నాఫ్ సత్యమూర్తి, రాజు గారి గది, బాహుబలి ఉన్నాయి. అత్యంత ప్రజాదారణ పొందిన టీవీ షోలలో అష్టాచమ్మా, జానకి రాముడు, శశిరేఖా పరిణయం మరియు మీలో ఎవరు కోటీశ్వరుడు ఉన్నాయి. ఫిబ్రవరి 2015లో ఆవిష్కరించబడిన హాట్ స్టార్, ప్రపంచంలో మరెక్కడా లేని రీతిలో నూతన సేవలను అత్యంత వేగంగా ఆవిష్కరించిన సంస్థగా నిలిచింది. గడిచిన 15 నెలల్లో 65 మిలియన్లకు పైగా దీనిని డౌన్ లోడ్ చేసుకున్నారు. దేశంలో ఒకే ఒక్క ప్రీమియం స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ ఇది. టీవీ, షోలు సినిమాలు లైవ్ స్పోర్ట్స్ ను దేశంలో పూర్తి ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com