సైరా యూనిట్‌కి అల్లు వారి పార్టీ

  • IndiaGlitz, [Friday,October 04 2019]

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన 'సైరా న‌ర‌సింహారెడ్డి' తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లై హిట్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టుకుంటుంది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్ సైరా యూనిట్‌కు పెద్ద పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి మెగా ఫ్యామిలీలోని కొంత మంది హీరోల‌తో పాటు, సైరా చిత్ర యూనిట్, కొంత మంది ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర‌వింద్‌, రామ్‌చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, అఖిల్ అక్కినేని, వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, శ్రీకాంత్‌, త్రివిక్ర‌మ్‌, సురేంద‌ర్ రెడ్డి, వంశీ పైడిప‌ల్లి, హ‌రీశ్ శంక‌ర్‌, సుకుమార్‌, బ‌న్నీ వాసు, జెమినికిర‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించ‌గా అమితాబ్ బ‌చ్చ‌న్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, కిచ్చాసుదీప్‌, విజ‌య్‌సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దాదాపు మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో సినిమా తెర‌కెక్కింది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌ను త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా తెర‌కెక్కించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల క‌లెక్ష‌న్స్‌ను గ‌ట్టిగానే రాబ‌ట్టుకుంది.

More News

'లైఫ్ స్టైల్ ' ఫస్ట్ లుక్ లాంచ్

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ఫస్ట్ లుక్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ వకుళాభరణం మోహనకృష్ణ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు.

ఇస్మార్ట్‌పై బాలీవుడ్ క‌న్ను

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు హ్యూజ్ హిట్ సాధించిన చిత్రాల్లో `ఇస్మార్ట్ శంక‌ర్` ఒక‌టి. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌,

'మామాంగం' నవంబర్ 21న రిలీజ్‌

భారత దేశం  సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన చారిత్రిక కథలు, పురాణ గాధలు ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరుస్తూ ఉంటాయి.

కొత్త ఇల్లు క‌ట్టుకుంటున్న బ‌న్నీ.. పేరేంటో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ కొత్త‌ ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

అక్టోబ‌ర్ 8న `ఎవ్వ‌రికీ చెప్పొద్దు` విడుద‌ల

ఒక‌బ్బాయి, అమ్మాయి.. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ అబ్బాయిని ఇష్ట‌ప‌డ్డ అమ్మాయి.. త‌న ప్రేమ‌ను మాత్రం అత‌నికి చెప్ప‌దు.