ప‌వ‌న్ స‌ర‌స‌న బ‌న్నీ హీరోయిన్‌...?

  • IndiaGlitz, [Tuesday,August 25 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్ అన‌గానే మ‌న‌కు వెంట‌నే గుర్తుకొచ్చే సినిమా ‘గ‌బ్బ‌ర్ సింగ్‌’. ప‌దేళ్లు హిట్ లేకుండా ఉన్నా కూడా ప‌వ‌ర్‌స్టార్ రేంజ్‌ను బాక్సాఫీస్‌కు చాటి చెప్పిన చిత్ర‌మిది. ఇండ‌స్ట్రీ హిట్‌ను సాధించిన చిత్ర‌మిది. ఇప్పుడు ఇదే కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా రానుంద‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ క‌థ‌ను కూడా రెడీ చేసుకున్నారు. ప‌వ‌న్ కోస‌మే వెయిట్ చేస్తున్నారీ డైరెక్ట‌ర్‌. ఈ సినిమాకు సంబంధించి వార్త‌ల‌నేకం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే.

తాజా స‌మాచారం మేర‌కు ప‌వ‌న్ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా న‌టింప చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇది వ‌ర‌కు హ‌రీశ్ శంక‌ర్ డైరెక్ట్ చేసిన డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ్‌, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాల్లో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అదే ర్యాపోతో మ‌రోసారి పూజాను న‌టింప చేయ‌డానికి హ‌రీశ్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా మ‌హేశ్‌, అల్లు అర్జున్‌, చ‌ర‌ణ్ స‌హా వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించారు. మ‌రిప్పుడు ప‌వ‌న్‌తో న‌టించ‌డానికి పూజాహెగ్డే ఒప్పుకుంటారో లేదో చూడాలి.

More News

మ‌ళ్లీ క్రేజీ కాంబో !!

కొన్ని కాంబినేష‌న్స్ పై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి బాగా ఉంటుంది. అలా ఆస‌క్తి రేపిన కాంబినేష‌న్స్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ ఒక‌టి.

మళ్లీ టాక్స్‌లో వ‌రుణ్ తేజ్ మూవీ!!

యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్‌,  'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలోనూ

ఆలియా త‌ప్పుకోలేదు... అయితే!!

బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ మూవీ ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమాలో

చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లి పీటలెక్కనున్న శర్వానంద్!

వైవిధ్యభరితమైన కథను ఎంచుకుంటూ ప్రతి సినిమానూ సక్సెస్ బాట పట్టించుకోవడంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ దిట్ట.

ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధంపై కోర్టును ఆశ్రయించిన టిక్‌టాక్..

అమెరికా.. సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ సంస్థ నిర్వాహకుల మధ్య వివాదం ముదురుతోంది. సోమవారం టిక్‌టాక్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.