ప్రభాస్ సినిమాలో బన్ని హీరోయిన్...
Send us your feedback to audioarticles@vaarta.com
మాస్క్, ముకుంద, మొహంజదారో సినిమాల్లో నటించిన పూజా హెగ్డే ఇప్పుడు అల్లుఅర్జున్ నటించి డిజె దువ్వాడ జగన్నాథమ్‌లో కూడా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం జూన్ 23న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే ప్రభాస్ `సాహో` సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వినపడుతున్నాయి. ముందుగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్స్ కత్రినా కైఫ్, శ్రద్ధాకపూర్, ఎమీజాక్సన్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు పూజా హెగ్డే పేరు వినపడుతుంది.
పూజా హెగ్డే కూడా సినిమాలో నటించడానికి సూచన ప్రాయంగా అంగీకరించిందని సమాచారం. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందనున్న ఈ సినిమాకు మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైన్ వర్క్ అందిస్తున్నారు. అల్రెడి సినిమా టీజర్ కూడా విడుదలైన హ్యుజ్ రెస్పాన్స్ రాబట్టుకుంది. ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments