మ్యూజిక్ సిట్టింగ్స్ లో అల్లుఅర్జున్, హరీష్ శంకర్ 'దువ్వాడ జగన్నాథమ్'
Send us your feedback to audioarticles@vaarta.com
`రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`.
ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ బ్యానర్ రూపొందుతున్న 25వ సినిమా ఇది. అల్లుఅర్జున్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు ప్రేక్షకులు, అభిమానులే కాదు, ఇండస్ట్రీ వర్గాలు సైతం సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
బన్ని సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడంటేనే అభిమానులు సినిమా మ్యూజికల్ హిట్ అని ఫిక్సయిపోతారు. అందుకు ఉదాహరణలే అల్లుఅర్జున్ నటించిన `ఆర్య`, `బన్ని`, `ఆర్య2`, `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` చిత్రాలు కమర్షియల్‌గా సూపర్‌హిట్ కావడమే కాదు, మ్యూజికల్‌గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మరోసారి బన్ని, దేవి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సర్వత్రా ఆసక్తినెలకొంది. ఈసారి దేవి ఎలాంటి మ్యూజిక్ వేవ్స్ క్రియేట్ చేస్తాడోనని ఎగ్జయిట్‌మెంట్‌తో గమనిస్తున్నారు. సినిమా కథ, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దువ్వాడ జగన్నాథమ్ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు స్టార్ హీరోను తెరపై సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో హరీష్ శంకర్ దిట్ట. ఈ విషయాన్ని ఆయన గత చిత్రాలే నిరూపించాయి. ఇన్ని బెస్ట్ క్వాలిటీస్‌తో రూపొందనున్నదువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది.
అల్లుఅర్జున్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్ రాజ్ నిర్మాత: దిల్‌రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments