అను ఆనందానికి బ్రేక్ వేసిన బన్నీ
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఫైనల్ రషెస్ చూసిన బన్నీ.. ఫస్ట్ హాఫ్‌లో తనకి అనుకి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్‌కు కత్తెర వేయమని డైరెక్టర్ వంశీకి చెప్పారని సమాచారం.
దీని వల్ల ప్రేక్షకులు కథ నుంచి సైడ్ ట్రాక్ పట్టే అవకాశం ఉందని.. సినిమా క్రిస్పీగా రావాలంటే సాధ్యమైనంత వరకు కొన్ని సన్నివేశాలను తొలగించమని బన్నీ కొన్ని సూచనలు చేశారన్నది ఇన్సైడ్ సోర్స్ టాక్. దానికి తగ్గట్టుగా.. బన్నీ చెప్పిన విధంగానే ఎడిటింగ్ చేయమని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుకు వంశీ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. బన్నీతో ఎక్కువ సన్నివేశాలలో నటించానని మురిసిపోతున్న అను ఆనందానికి మాత్రం కత్తెర పడినట్టే అని చిత్ర వర్గాలు చెప్పుకుంటున్నాయి. శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com