పుష్ప క్రూ మెంబర్స్‌కి బన్నీ సర్‌ప్రైజ్.. గోల్డ్ రింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఐకాన్ స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘‘పుష్ప’’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ‘‘పుష్ప ది రైజింగ్’’ పేరిట డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్, ధనుంజయ్, రావు రమేశ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పాటలు, పోస్టర్ల ద్వారా సినిమాపై హైప్ పెంచారు. గత సోమవారం విడుదలైన ట్రైలర్‌తో ఈ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
ఈ సోమవారమే పుష్ప షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసింది యూనిట్. ఈ సందర్భంగా అల్లు అర్జున్ క్రూ సిబ్బందికి సర్‌ప్రైజ్ చేశారు. డజను మంది సిబ్బందికి తులం (10 గ్రాములు) విలువైన బంగారు ఉంగరాలను గిఫ్ట్‌గా ఇచ్చాడు. వీరిలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్లు, ఇతర సిబ్బంది వున్నారు. వీలైనంత త్వరగా పాటను పూర్తి చేసినందుకు మెచ్చుకున్న బన్నీ.. ఇలా క్రూ మెంబర్స్‌ని ఖుషీ చేశాడు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో అల్లు అర్జున్, సమంతలపై ఈ పాటను చిత్రీకరించారు.
కాగా.. ఇటీవల బన్నీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది రష్మిక. ‘‘పుష్ప త్వరలో విడుదల కాబోతుంది కదా సర్.. స్పెషల్‌గా ఏదైనా పంపించాలనిపించింది. అందుకే మీకోసం గిఫ్ట్ ’’ అంటూ స్వయంగా రాసిన నోట్, కొన్ని వస్తువులను బాక్స్‌లో పెట్టి పంపించింది రష్మిక. దీనిని అల్లు అర్జున్ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ రష్మికకు థ్యాంక్స్ చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments