బన్ని ఫస్ట్, మహేష్ సెకండ్..మరి ప్రభాస్..?
Send us your feedback to audioarticles@vaarta.com
బన్ని ఫస్ట్..మహేష్ సెకండ్..ఏమిటి ఈ లెక్క అనుకుంటున్నారా..? ఈ సంవత్సరం గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాలీవుడ్ హీరోల్లో బన్ని ఫస్ట్ ప్లేస్ లో, మహేష్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. అల్లు అర్జున్ ఫేస్ బుక్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌతిండియా హీరోగా, ట్విట్టర్ లో తక్కువ టైమ్ లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ కు చేరుకున్న హీరోగా రికార్డ్ సాధించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ సంవత్సరం గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన తెలుగు హీరోల లిస్ట్ లో అల్లు అర్జున్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుని మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు. అల్లు అర్జున్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు రెండో స్ధానంలో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడో స్ధానంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాలుగవ స్ధానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐదవ స్ధానంలో నిలిచారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com