అత్తాఅత్తారింట్లో కోపం తెచ్చుకున్న బ‌న్ని

  • IndiaGlitz, [Friday,October 23 2015]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ద‌సరా పండ‌గ‌కి భార్య స్నేహారెడ్డి అమ్మ‌మ్మ స్వ‌గ్రామం న‌ల్గొండ జిల్లా పెద్ద‌పూర్ మండ‌లం చింత‌ప‌ల్లి గ్రామానికి కుటుంబ స‌మేతంగా వెళ్లారు. అయితే త‌మ ఊరుకి అల్లు అర్జున్ వ‌చ్చిన విష‌యాన్ని తెలుసుకుని బ‌న్నిని చూసేందుకు గ్రామ‌స్ధులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. బ‌న్నిని చూడ‌డానికి వ‌చ్చిన జ‌నాన్ని కంట్రోల్ చేయ‌డం కుటుంబ స‌భ్యులుకు క‌ష్ట‌మైంది.

అయితే బ‌న్నిని చూడ‌డానికి వ‌చ్చిన వారిలో ఒక వ్య‌క్తి మిగిలిన వారిని తోసేయ‌డం చూసిన బ‌న్నికి కోపం వ‌చ్చింది. వెంట‌నే ఆ వ్య‌క్తితో.... కుర్రోళ్లు మీద చేయి వేస్తున్నావ్ ..ఏంటి..? అంటూ త‌న‌దైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు. ఏది ఏమైనా...చింత‌ప‌ల్లి గ్రామ‌స్ధులు త‌మ గ్రామానికి బ‌న్ని రావ‌డం సంతోషంగా ఉందంటున్నారు. బ‌న్ని ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స‌రైనోడు సినిమాలో న‌టిస్తున్నాడు. స‌మ్మ‌ర్ లో స‌రైనోడో మూవీని రిలీజ్ చేయ‌నున్నారు.

More News

శ్రీమంతుడు పై కాంట్ర‌వ‌ర్సీ

మ‌హేష్ బాబు, కొర‌టాల శివ కాంబినేష‌న్లో శ్రీమంతుడు సినిమా రూపొంద‌డం...ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం తెలిసిన విష‌య‌మే.

సూపర్ స్టార్ మహేష్ ను కలిసిన సిద్ధాపురం గ్రామస్థులు

సూపర్ స్టార్ మహేష్ తాను నిజమైన ‘శ్రీమంతుడు’గా నిరూపించుకున్నారు. ఆయన సిద్ధాపురం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

ఆర్డిన‌రీ మూవీ చేస్తున్న సుమంత్

ప్ర‌ముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు త‌న‌యుడు సుమంత్ అశ్విన్ తాజా చిత్రం కొలంబ‌స్. యూత్ ఫుల్ ల‌వ్ స్టోరిగా రూపొందిన కొలంబ‌స్ యూత్ ను ఆక‌ట్టుకుంటుంది.

ప్ర‌యోగాత్మ‌క మూవీలో రాజ్ త‌రుణ్

ఉయ్యాలా జంపాలా మూవీతో హీరోగా ప‌రిచ‌య‌మై..తొలి చిత్రంతో స‌క్సెస్ సాధించి...మ‌లి చిత్రం సినిమా చూపిస్తా మామ‌తో మ‌రో విజ‌యాన్ని సాధించిన యంగ్ హీరో రాజ్ త‌రుణ్.

'నాన్నకు ప్రేమతో' టీజర్‌కు ఒక్కరోజులోనే 1 మిలియన్‌ వ్యూస్‌

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.