అత్తాఅత్తారింట్లో కోపం తెచ్చుకున్న బన్ని
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ దసరా పండగకి భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామం నల్గొండ జిల్లా పెద్దపూర్ మండలం చింతపల్లి గ్రామానికి కుటుంబ సమేతంగా వెళ్లారు. అయితే తమ ఊరుకి అల్లు అర్జున్ వచ్చిన విషయాన్ని తెలుసుకుని బన్నిని చూసేందుకు గ్రామస్ధులు భారీగా తరలివచ్చారు. బన్నిని చూడడానికి వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడం కుటుంబ సభ్యులుకు కష్టమైంది.
అయితే బన్నిని చూడడానికి వచ్చిన వారిలో ఒక వ్యక్తి మిగిలిన వారిని తోసేయడం చూసిన బన్నికి కోపం వచ్చింది. వెంటనే ఆ వ్యక్తితో.... కుర్రోళ్లు మీద చేయి వేస్తున్నావ్ ..ఏంటి..? అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చాడు. ఏది ఏమైనా...చింతపల్లి గ్రామస్ధులు తమ గ్రామానికి బన్ని రావడం సంతోషంగా ఉందంటున్నారు. బన్ని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. సమ్మర్ లో సరైనోడో మూవీని రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com