బన్ని మూవీ రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Monday,December 07 2015]

రేసుగుర్రంలా క‌థానాయ‌కుల రేసులో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్‌. ప్ర‌స్తుతం ఈ మెగా వారి క‌థానాయ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో 'స‌రైనోడు' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అల్లుఅర‌వింద్ బ‌న్ని పుట్టిన‌రోజు కానుక‌గా ఏప్రిల్ 8న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. రేసుగుర్రం కూడా ఏప్రిల్ 11నే విడుద‌లైంది. ఉగాది ద‌గ్గ‌ర ఉండ‌టం మ‌రో కార‌ణంగా క‌న‌ప‌డుతుంది. ఇన్ని గుడ్ మూమెంట్స్ క‌న‌ప‌డుతుంటే అల్లు అరవింద్ ఎందుకు మిస్ చేసుకుంటాడు. అందుకే సినిమా రిలీజ్ ప్లానింగ్‌ను ప‌క‌డ్బందీగానే చేస్తున్నాడ‌ట‌. ర‌కుల్ ప్రీత్ సింగ్, క్యాథ‌రిన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. హీరో ఆది పినిశెట్టి విల‌న్‌గా నటిస్తున్నాడు.