వెబ్ సిరీస్ వైపు బన్నీ అడుగులు..!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. స్టార్ డమ్ రాగానే హీరో హీరోయిన్లంతా బిజినెస్‌పై దృష్టి సారించడం కామన్. కానీ బన్నీ ఎందుకో గానీ ఈ విషయంలో ఇప్పటి వరకూ వెనుకబడే ఉన్నాడు. కానీ తాజాగా దీనికి సంబంధించి ఓ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన నిర్మాణ రంగాన్ని తను కూడా ఎంచుకోనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వడివడిగా అడుగులు పడుతున్నాయి.
అయితే బన్నీ వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బన్నీ టీమ్ చాలా కథలు వినడంతో పాటు.. వాటిలో కొన్ని కథలను ఓకే చేసిందని టాక్. అయితే ఓకే చేసిన కథల నుంచి ఒక కథను వెబ్ సిరీస్ కోసం ఎంచుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వెబ్ సిరీస్ అల్లు అర్జున్ సమర్పకుడిగా ఉండబోతున్నాడా? లేదంటే నిర్మాతగా ఉండబోతున్నాడా? అనేదే సస్పెన్స్.
ఏదో ఒకరకంగా బన్నీ పేరు పడితే మాత్రం ఆ వెబ్ సిరీస్‌కి బీభత్సమైన క్రేజ్ వస్తుంది. దీంతో ప్రేక్షకులు పెద్ద మొత్తంలో ఈ వెబ్ సిరీస్‌ను చూసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. వారందరినీ ఆకట్టుకోగలిగితేనే బన్నీ పేరు నిలబడుతుంది. లేదంటే అంతటి స్టార్ డమ్ ఉన్న హీరో వెబ్ సిరీస్ విషయంలో ఫెయిల్ అయ్యాడంటే అది వినడానికి చాలా బాగోదు. కాబట్టి ఈ వెబ్ సిరీస్‌పై బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన వివరాలన్నీ దీపావళికి వెల్లడయ్యే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com