బన్నీ కొత్త వ్యాపారం
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా కోసం సన్నద్ధం అవుతున్నారు బన్నీ. కాగా కరోనా వైరస్ ప్రభావంతో ఈ వారంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా.. బన్నీ సినిమాల్లో హీరోగా నటిస్తూనే నిర్మాతగా కూడా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త బిజినెస్‌లోకి అల్లు అర్జున్ అడుగు పెట్టాడట. వివరాల ప్రకారం కార్లను లీజుకు ఇచ్చే ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలో దాదాపు రూ.8 కోట్లు ఖర్చు పెట్టి బన్నీ 7 శాతం వాటాను కోనుగోలు చేశాడట. సెలబ్రిటీల పెళ్లిళ్లు, ఫంక్షన్స్ మొదలైన వాటికి బ్రాండెడ్ కార్లను ఈ ఆటో మొబైల్ కంపెనీ లీజుకు ఇస్తుంటుందట. బన్నీతో పాటుతో పాటు ఓ ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకుడు కూడా ఇందులో భాగస్వామిగా వ్యవహరిస్తున్నారని సమాచారం.
ఇక సినిమాల విషయానికి వస్తే బన్నీ ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత మూడోసారి సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com