నైట్ క్లబ్ బిజినెస్ లోకి బన్ని...

  • IndiaGlitz, [Monday,July 25 2016]

సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు సినిమాల‌తో పాటు హోట‌ల్స్‌, ప‌బ్స్‌, ఎయిర్‌వేస్ స‌హా ప‌లు బిజినెస్‌లలో పార్ట‌న‌ర్స్‌గా ఉంటున్నారు. మ‌రి కొంద‌రైతే రియ‌ల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కూడా వ్యాపారం రంగంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ విష‌యాన్ని బ‌న్ని ఓ అంగ్ల దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. యం కిచెన్స్‌, బ‌ఫెల్లో వైల్డ్ వింగ్స్ అనే సంస్థ‌లు అప్రోచ్ అయ్యాయి. వారితో క‌లిసి 800జూబిలీ అనే క్ల‌బ్ పెడుతున్నాం అని చెప్పుకొచ్చాడు. జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లో రానున్న ఈ క్ల‌బ్‌లో జ‌ప‌నీస్ రెస్టారెంట్‌, ఓకేఫ్‌తో పాటు బార్బి క్యూ రెస్టారెంట్ వ‌గైరా ఉంటుంద‌న్నారు. ఈ నెల 29నే ఈ క్ల‌బ్ ప్రారంభ‌మయ్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయ‌ట‌.

More News

కమల్ హెల్త్ గురించి ఇంపార్టెంట్ అప్ డేట్..

యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ ఇటీవల చెన్నైలోని తన నివాసం లో మెట్ల పై నుంచి పడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్ చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కమల్ కాలికి ఆపరేషన్ చేయడం జరిగింది.

200కోట్లు దాటేసిన 'కబాలి'

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేస్తూ ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు ఇండియా సహా 30 దేశాల్లో విడుదలైన ఈ చిత్రం రెండు వందల కోట్ల మార్కును దాటేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి.

బాహుబ‌లి అయినా...పెళ్లి చూపులు అయినా ఆడియ‌న్స్ చూసేది అదే - నిర్మాత రాజ్ కందుకూరి

విజయ్ దేవ‌ర‌కొండ‌, రీతువ‌ర్మ‌, నందు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నూత‌న ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం పెళ్లి చూపులు. ఈ చిత్రాన్ని ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ & బిగ్ బెన్ సినిమాస్ బ్యాన‌ర్స్ పై రాజ్ కందుకూరి, య‌స్.రంగినేని సంయుక్తంగా నిర్మించారు.

అంప‌శ‌య్య కోసం న‌గ్న దృశ్యాలు చిత్రీక‌రించిన మాట వాస్త‌వ‌మే - ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ జైని

అందరూ ఆర్ట్‌ ఫిల్మ్‌ అంటున్నారు. మనసుతో చూడాల్సిన హార్ట్‌ ఫిల్మ్‌ ఇది. హృదయానికి హత్తుకునే ఓ మధ్య తరగతి విద్యార్థి మానసిక సంఘర్షణలకు దర్పణం పట్టే దృశ్యకావ్యం’’ అని దర్శకుడు ప్రభాకర్‌ జైని అన్నారు.

ఆగ‌ష్టు 13న నాగ‌శౌర్య నీ జ‌త‌లేక‌ విడుద‌ల‌

యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా, పారుల్‌, సరయు కథానాయికలుగా ఓగిరాల వేమూరి నాగేశ్వరరావు సమర్పణలో శ్రీ సత్య విదుర మూవీస్‌ బ్యానర్‌పై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో జి.వి.చౌదరి, నాగరాజుగౌడ్‌ చిర్రా నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'నీ జతలేక'.