దువ్వాడ జగన్నాధమ్ షూటింగ్ ప్రారంభం..!
Thursday, October 20, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డి.జె దువ్వాడ జగన్నాధమ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్డే నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ & టీమ్ కు ఆల్ ది బెస్ట్ అంటూ ఫస్ట్ డే షూటింగ్ వర్కింగ్ స్టిల్స్ పోస్ట్ చేసారు. ఈరోజు ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరికి పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇక చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments