పుష్ప పార్ట్ 2 : పాన్ ఇండియా క్రేజ్.. ఈ సారి రెమ్యూనరేషన్ కింద ‘‘హిందీ’’ రైట్స్ అడుగుతోన్న బన్నీ..?
Send us your feedback to audioarticles@vaarta.com
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్ ప్రజలను విశేషంగా అలరించాయి. ఎక్కడ చూసినా కూడా పుష్ప పేరు బాగా వినిపించింది.వయసుతో సంబంధం లేకుండా ‘‘తగ్గేదే లే’’ అంటూ పుష్ప సినిమా డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజాన్ని అనుకరించారు. వీరిలో సినీతారలు, క్రీడాకారులు చివరికి రాజకీయ నాయకులు కూడా వున్నారు. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పలు పార్టీలు ప్రచారానికి పుష్ప సినిమాను వాడుకున్నారు.
పుష్ప సినిమాను భాషతో సంబంధం లేకుండా దేశప్రజలు ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లు వసూలు చేయడంతో పాటు హిందీ జనాల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. పుష్ప పార్ట్ 1 ఇచ్చిన ఉత్సాహంతో ‘‘పుష్ప సెకండ్ పార్ట్’’ను పట్టాలెక్కించే పని మొదలుపెట్టారు మేకర్స్. త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి భాగానికి మించి ఈ సినిమాలో స్టెప్పులు .. ఫైట్లు ఉండాలని సుకుమార్ తో బన్నీ చెప్పినట్లుగా ఫిలింనగర్ టాక్. దాంతో యాక్షన్ కొరియోగ్రఫర్లు .. డాన్స్ కొరియోగ్రఫర్లు కసరత్తు మొదలెట్టారని సమాచారం.
పుష్ప రెండవ భాగానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేశారట. తన పారితోషికం కింద హిందీ రైట్స్ డిమాండ్ చేస్తున్నారట. హిందీలో బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్‌కు మంచి పలుకుబడి వుంది. అలాగే గతంలో ఎన్నో సినిమాలను అరవింద్ హిందీలో నిర్మించడం, పంపిణీ చేయడం లాంటివి చేశారు. ఈ కారణం చేతే అల్లు అర్జున్ ఈ స్టెప్ తీసుకున్నారని ఫిలింనగర్ టాక్. అంతేకాదు.. ఒకవేళ సినిమా బాగా ఆడితే రెమ్యూనరేషన్‌ను మించి ముడుతుందని బన్నీ ఆలోచన. మరి ఈ విషయంలో నిజమెంత వుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments