అల్లు అర్జున్ కూతురు పేరు..!

  • IndiaGlitz, [Sunday,December 25 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి దంప‌తుల‌కు 2014 ఏప్రిల్ 4న అయాన్ జ‌న్మించారు. ఆత‌ర్వాత ఈ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 21న అల్లు అర్జున్, స్నేహ దంప‌తుల‌కు పాప పుట్టింది. పాప పుట్టిన సంద‌ర్భంగా అల్లు అర్జున్ స్పందిస్తూ...ఒక బాబు, ఒక పాప ఇంత కంటే ఇంకేం కావాలి. ల‌క్కీ ఫీలింగ్ అంటూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసాడు. ఇక క్రిస్మ‌స్ సంద‌ర్భంగా అల్లు అర్జున్, స్నేహ దంప‌తులు త‌మ పాప పేరును, ఫోటోను ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేయ‌నున్నారు. పాప పుట్టిన సంద‌ర్భంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన బ‌న్ని డి.జె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.